Site icon HashtagU Telugu

Allu Arjun : చిరంజీవి వల్ల నష్టపోయిన అల్లు అర్జున్..

Allu Arjun Loss Money Due to Chiranjeevi in Betting

Allu Arjun Loss Money Due to Chiranjeevi in Betting

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వల్ల పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ఎంతో ఫేమ్‌ని సంపాదించుకున్నారు. తమకి ఇండస్ట్రీలోకి రావడానికి ఒక పూల దారివేసిన చిరుకి మెగా హీరోలంతా రుణపడి ఉంటామంటూ చాలా సందర్భాల్లో కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి వల్ల ఒక సందర్భంలో నష్టపోయినట్లు చెప్పుకొచ్చారు. అది కూడా చిరంజీవి ప్రమేయం లేకుండానే జరిగినట్లు అల్లు అర్జున్(Allu Arjun) పేర్కొన్నారు. ఇంతకీ బన్నీ ఎలా నష్టపోయారు..?

చిరంజీవి నటించిన ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘ఇంద్ర'(Indra)అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో చిరు చెప్పే డైలాగ్స్, ఫైట్స్, డాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటి కోసమే అప్పటిలో ఈ చిత్రాన్ని థియేటర్ లో రిపీటెడ్ గా చూసిన వారే సంఖ్య ఎక్కువ. ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో ‘దాయి దాయి దామ’ సాంగ్ కి చిరు వేసే ‘వీణ స్టెప్’ అయితే ఎవర్ గ్రీన్. చిరంజీవి ఆ స్టెప్ వేస్తుంటే ప్రతి ఒక్కరు మెస్మరైజ్ అయిపోయారు. అప్పట్లో ఆ స్టెప్ బాగా ఫేమస్ అయింది. ఇప్పటికి కూడా ఆ స్టెప్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ వీణ స్టెప్ వలనే అల్లు అర్జున్ నష్టపోయారట. ఒకసారి ఈ స్టెప్ గురించి అల్లు అర్జున్, అతని స్నేహితుడు మధ్య ఒక చర్చ జరిగిందట.

ఆ చర్చలో అల్లు అర్జున్ స్నేహితుడు.. “వీణ స్టెప్ వేస్తున్న సమయంలో చిరంజీవి పక్కన హీరోయిన్ సోనాలిబింద్రే కూడా ఉందని” చెప్పడం, దానిని బన్నీ తప్పు అని వాదించాడు. ఈక్రమంలోనే అల్లు అర్జున్.. “నేను ఆ సినిమా 17 సార్లు చూశాను. ఆ స్టెప్ వేస్తున్న సమయంలో చిరంజీవి మాత్రమే ఉంటారు. రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంటు వేసుకొని ఆయన ఆ స్టెప్ వేస్తుంటారు. పక్కన ఎవరు ఉండరు. కావాలంటే పందెం కాస్తాను” అని చెప్పి ఫ్రెండ్ తో 25వేలు పందెం కట్టారు. ఆ తరువాత వెళ్లి ఆ సాంగ్ చూస్తే చిరంజీవి పక్కన సోనాలిబింద్రే ఉంది. దీంతో బన్నీ పాతికవేలు నష్టపోయినట్లు అయ్యింది. చిరంజీవి వీణ స్టెప్ వేస్తుంటే పక్కన ఎవరు ఉన్నారు అనేది కూడా గమనించలేనంతగా మెస్మరైజ్ అయిపోయాను అని బన్నీ చెప్పాడు. అందుకే బెత లో ఓడిపోయి 25 వేలు పోగొట్టుకున్నాను అన్నాడు.