Site icon HashtagU Telugu

Allu Arjun : దేవర డైరెక్టర్ తో పుష్ప రాజ్..!

Allu Arjun Koratala Siva is on Cards

Allu Arjun Koratala Siva is on Cards

పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun,) ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఐతే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అది ఎలా ఉంటుంది అన్న ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో మొదలైంది. ఐతే ఇప్పటికే త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని నిర్మాత నాగ వంశీ చెప్పాడు. కొత్త కాన్సెప్ట్ తో ఆ సినిమా వస్తుందని అంటున్నారు.

ఐతే త్రివిక్రం సినిమాతో పాటు దేవర డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)తో కూడా అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అసలైతే దేవర ముందే బన్నీతో కొరటాల శివ సినిమా ప్రకటన వచ్చింది. ఆయన పుష్ప తో బిజీ అవ్వడం వల్ల ఆ సినిమా కుదరలేదు. ఈలోగా కొరటాల శివ కూడా దేవర సినిమా చేశాడు.

దేవర 1 ముందు నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా సక్సెస్ అయినట్టే లెక్క. దేవర 2 ఏం చేస్తారన్నది చూడాలి. ఐతే ఈలోగా అల్లు అర్జున్ తో కొరటాల శివ సినిమా అంటూ హడావిడి మొదలైంది. దేవర 2 చేస్తారా లేదా అల్లు అర్జున్ తో కానిస్తాడా అన్నది చూడాలి. త్రివిక్రం తో సినిమా చేస్తూ మరోపక్క కొరటాల శివ సినిమాను హ్యాండిల్ చేయాలని చూస్తున్నాడు. మరి అల్లు అర్జున్ ప్లాన్ ఏంటన్నది క్లారిటీ వస్తే బాగుంటుంది. పుష్ప 2 హిట్ అయినా బన్నీకి హ్యాపీ లేదు. ఐతే పరిస్థితులు కాస్త కుదుట పడ్డాకే తన నెక్స్ట్ సినిమా మొదలు పెడతాడని చెప్పొచ్చు.