Kabhi Apne Kabhi Sapne అల్లు అర్జున్ క్రిష్ కాంబోలో కభి అప్నే కభి సప్నే అంటూ ఒక సినిమా పోస్టర్ రిలీజైంది. పుష్ప 1 (Pushpa) తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. 2024 ఆగష్టు 15కి పుష్ప 2 రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం తో నాల్గవ సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురములో తర్వాత వీరి కాంబో సినిమా రాబోతుంది. అయితే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే క్రిష్ తో సినిమా అది కూడా టైటిల్ తో సహా అనౌన్స్ చేశారు.
కభి అప్నే కభి సప్నే అంటూ హిందీ టైటిల్ తో అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా వస్తుంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. పవన్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న క్రిష్ ఆ సినిమా పూర్తి చేసి అల్లు అర్జున్ తో ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇంతకీ కభి అప్నే కభి సప్నే నిర్మాత ఎవరు. సినిమా మిగతా కాస్ట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
కభి అప్నే కభి సప్నే (Kabhi Apne Kabhi Sapne ) పోస్టర్ చూసి క్రిష్ అల్లు అర్జున్ తో ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడని అల్లు ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ క్రిష్ కలిసి వేదం సినిమా చేశారు. మళ్లీ చాపా గ్యాప్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. పుష్ప 2 తర్వాత త్రివిక్రం, సందీప్ వంగ ఇలా డైరెక్టర్స్ ని ఆల్రెడీ లైన్ లో పెట్టిన అల్లు అర్జున్ సడెన్ గా క్రిష్ తో సినిమా అనౌన్ చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు.
పుష్ప తో హిందీ ఆడియన్స్ కి దగ్గరైన అల్లు అర్జున్ ఇక మీదట తన సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే క్రిష్ తో హిందీలోనే సినిమా చేసి బీ టౌన్ ఆడియన్స్ కి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు అల్లు అర్జున్.
Also Read : Skanda Review : స్కంద : రివ్యూ