Pushpa 2 : ఫ్యాన్స్ తో కలిసి ‘పుష్ప-2′ చూడబోతున్న అల్లు అర్జున్

Pushpa 2 : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి బన్నీ పుష్ప 2 చూడబోతున్నారు. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Released

Allu Arjun Released

మరికొద్ది సేపట్లో ‘పుష్ప-2′ (Pushpa 2) సందడి మొదలుకాబోతుంది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు తెరపడబోతుంది. సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటీకే అడ్వాన్స్ బుకింగ్ తో రూ.100 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అంత ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటె ‘పుష్ప-2’ సినిమాను అభిమానులతో చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సిద్దమయ్యాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ (Sandhya Theater) లో ఫ్యాన్స్ తో కలిసి బన్నీ పుష్ప 2 చూడబోతున్నారు. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షో(Pushpa 2 Premiere Show)లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై సాయంత్రంలోపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, దీనికోసం నిర్వాహకులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

మరోపక్క ఈ సినిమా రిలీజ్ సందర్బంగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘పుష్ప-2’ టీమ్క విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

Read Also : Devendra Fadnavis : మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక

  Last Updated: 04 Dec 2024, 01:30 PM IST