ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) నుంచి బాలీవుడ్ దాకా ఇతిహాసాలు, పౌరణికాల కథల చుట్టు చక్కర్లు కొడుతున్నాయి. టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, ఓంరౌత్ లాంటివాళ్లు రామాయణ్, మహాభారత్ లాంటి సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అభిరుచి గల నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు, ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య ధర్ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితమే కార్యరూపం దాల్చక తెరమరుగైంది. మళ్లీ ఆయన కలల ప్రాజెక్టు ‘అమర అశ్వత్థామ’ (Mahabharata) ట్రాక్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
పౌరాణిక మాగ్నమ్ మూవీని ప్రోడ్యూస్ చేయడానికి జియో స్టూడియోస్ సీనియర్ ప్రతినిధులు ముందుకు రావడంతో ఆసక్తిని రేపుతోంది. ప్రధాన పాత్ర కోసం అల్లు అర్జున్‌తో (Allu Arjun) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ కూడా ఈ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మేరకు నిర్మాతలు ఐకాన్ స్టార్ ను కలిసినట్టు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే అర్జున్ ఆదిత్య కలను నెరవేతుందో లేదో కానీ ప్రొడక్షన్ హౌస్ రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్‌తో పుష్ప 2: ది రూల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించనున్నాడు. పుష్ప సినిమాతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియాలో రేంజ్ లో మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మహాభారత్ లో కీలక పాత్రలో నటించే అవకాశాలున్నాయి.
Also Read: Lokesh Yuvagalam: లోకేశ్ అన్ స్టాపబుల్, యువగళానికి 100 రోజులు!