Site icon HashtagU Telugu

Allu Arjun : పుష్ప 3లో బాలయ్య.. అఖండ 3 లో అల్లు అర్జున్..!

Allu Arjun In Balakrishna Unstoppable Season 4 Latest Promo

Allu Arjun In Balakrishna Unstoppable Season 4 Latest Promo

నందమూరి బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ (Unstoppable) సీజన్ 4 లో నాలుగో ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ సీజన్ 4కి వచ్చారు. బాలకృష్ణ అల్లు అర్జున్ సరదా సంభాషణలు ఎపిసోడ్ ని క్రేజీగా మార్చాయని తెలుస్తుంది. దీనికి సంబందించిన ప్రోమో రిలీజైంది.

ముందుగా బాలకృష్ణ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ఇంట్రడక్షన్ ఇవ్వగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇష్టమైన హీరోలు, హీరోయిన్స్ గురించి.. వేరే స్టార్ హీరోల ఫోటోలను చూపిస్తూ వారి గురించి అల్లు అర్జున్ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రోమో చివర్లో మీరు పుష్ప 3 చేయండి.. నేను అఖండ 3 చేస్తానని అన్నాడు అల్లు అర్జున్ దానికి బాలకృష్ణ కూడా ఓకే చెప్పాడు.

ఎపిసోడ్ ప్రోమో..

రష్మిక, పూజా హెగ్దే ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అంటే.. నువ్వు పూజా హెగ్దే తీసుకో నాకు రష్మిక కావాలని అన్నారు బాలకృష్ణ (Balakrishna) , దానికి ఈ సినిమా వరకు నాకు రష్మికనే కావాలని అన్నాడు. ఇలా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రోమో ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి ఫోటో, మహేష్ ఫోటో వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఏమని చెప్పాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కూడా అల్లు అర్జున్ ప్రస్తావించే ఛాన్స్ ఉందనిపిస్తుంది. మరి బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 లో అల్లు అర్జున్ హంగామా ఎలా ఉంటుందో పూర్తి ఎపిసోడ్ వస్తేనే కానీ తెలుస్తుంది.