Site icon HashtagU Telugu

Allu Arjun : నేషనల్ అవార్డు అందుకొని వస్తున్న బన్నీ.. ఇంటి వద్ద అభిమానుల సందడి..

Allu Arjun Grand Welcome by Fans at His home after Receiving National Award

Allu Arjun Grand Welcome by Fans at His home after Receiving National Award

పుష్ప(Pushpa) సినిమాకు గాను అల్లు అర్జున్(Allu Arjun) నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు(National Best Actor Award) అందుకున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం రాష్ట్రపతి చేతుల మీదగా బన్నీ అవార్డు అందుకున్నారు. ఇప్పటికే అభిమానులు, పలువురు ప్రముఖులు బన్నీకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

అయితే బన్నీ నేషనల్ అవార్డు అందుకొని ఢిల్లీ నుండి నేడు రిటర్న్ అయ్యారు. ఈ విషయం తెలిసి అభిమానులు బన్నీ ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. బన్నీ వచ్చే సమయానికి పూలు, అల్లు అర్జున్ బ్యానర్లు, జెండాలు, దండలతో ఇంటివద్ద ఎదురు చూశారు. బన్నీ రావడంతోనే పూలు చల్లుతూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు.

 

అభిమానుల సందడి మధ్య బన్నీ నేషనల్ అవార్డు అందుకొని ఇంటికి చేరుకున్నారు. దీంతో బన్నీ ఇంటివద్ద అభిమానులు హంగామా చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also Read : Sampoornesh Babu : సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’ ట్రైలర్ చూశారా?