Site icon HashtagU Telugu

Allu Arjun : ఏపీలో అల్లు అర్జున్ బిజినెస్ మొదలుపెట్టబోతున్నాడా…?

Allu Arjunaaa

Allu Arjunaaa

చిత్రసీమ (Film Industry )లో ఓ పక్క రాణిస్తూనే మరోవైపు సొంతంగా పలు బిజినెస్ లు చేస్తూ నాల్గు రాళ్లు సంపాదించుకుంటుంటారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు , నిర్మాతలు ఇలా చిత్రసీమకు చెందిన అనేక రంగాల వారు అనేక బిజినెస్ లు చేస్తుంటారు. ఇక టాలీవుడ్ (Tollywood) విషయానికి వస్తే మహేష్ బాబు , అల్లు అర్జున్ , రామ్ చరణ్ , విజయ్ దేవరకొండ తదితర హీరోలు ,హీరోయిన్లు చిత్రసీమలో గట్టిగా వెనకేసుకుంటూనే తమ ఇంట్రస్ట్ తగ్గట్లు బిజినెస్ లు చేస్తూ రాణిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మహేష్ , బన్నీ , విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు నగరంలో ఇప్పటికే మల్లీప్లెక్స్ థియేటర్లను రన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) కు AAA, మహేశ్ బాబుకు AMB, అలాగే విజయ్ దేవరకొండ కు VD పేరుతో హైదరాబాద్ నగరంలో మల్లీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. త్వరలోనే మాస్ మహరాజా ర‌వితేజ కూడా మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు.

ఇక హైదరాబాద్ లో AAA పేరుతో మల్లీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తోన్న అల్లు అర్జున్ ఇప్పుడు తన బిజినెస్ ను మరింతగా విస్తరింప చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే వైజాగ్ లో అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్ నిర్మించాలని చూస్తున్నారట. ఇందుకోసం వైజాగ్‌లో కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్‌లో ఏషియన్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటుచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రక‌ట‌న రావాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 మూవీ తో బిజీ గా ఉన్నాడు. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల రాబోతుంది. ఈ మూవీ తర్వాత అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు.

 

Read Also : Sweet Corn: స్వీట్ కార్న్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Exit mobile version