Site icon HashtagU Telugu

Pushpa’s Rule Begins: అదిరిపోయిన పుష్ప2 టీజర్.. బన్నీ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్!

Allu Arjun Pushpa 2

Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప ది రూల్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మేకర్స్ అదిరిపొయే గిఫ్ట్ ఇచ్చారు. రెండు రోజుల క్రితమే ‘వేర్ ఈజ్ పుష్ప’ వీడియోను వదిలిన మేకర్స్ శుక్రవారం కొద్దిసేపటి క్రితమే టీజర్ రూపంలో ఫుల్ వీడియోను వదిలారు. స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో అల్లు అర్జున్ స్మగ్లర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 3 నిమిషాలు నిడివి ఉన్న టీజర్ లో పుష్ప తిరుపతి జైలు నుంచి తప్పించుకోగా, తన కోసం శేషాచలం అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెడతారు. అయితే ఆ సెర్చింగ్ లో పోలీసులకు పుష్ప చొక్కా దొరుకుతుంది. సుమారు 8 బులెట్లు తగలడంతో పుష్ప చనిపోయి ఉంటాడు అని న్యూస్ లో వార్త వస్తుంది.

పుష్పను హత్య చేసినందుకు పోలీసులపై తిరుపతి నగర ప్రజలు నిరసన తెలుపుతుండగా, టెలివిజన్ ఛానళ్లు పుష్ప ఆచూకీ కోసం నిరాంతరాయంగా బులిటెన్స్ ఇస్తుంటారు. పుష్ప అచూకీపై సస్పెన్స్ నెలకొనడం, చివరకు ఆయన బతికే ఉన్నాడని స్పష్టం కావడంతో ప్రజలు సంబురాల్లో మునిగితేలడం లాంటివి చూడొచ్చు. ‘‘అడవిలో జంతువులు రెండు అడుగు వెనక్కి వేస్తే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం’’ అనే డైలాగ్ రొమాలు నిక్క పొడుచుకునేలా చేస్తాయి.

పుష్ప పార్ట్ 1 ఊహించనివిధంగా హిట్ కావడంతో ‘పుష్ప ది రూల్’ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ అప్ డేట్ కోసం అభిమానులు గీతా ఆర్ట్స్ ముందు ధర్నాకు దిగారంటే ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక April 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా నిర్మాతలు ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతినాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు వార్తలు కూడా వినిపించాయి.

Exit mobile version