Site icon HashtagU Telugu

Allu Arjun: ‘‘నందమూరి, అల్లు ఫ్యామిలీ బంధం’’ మా తాతగారి కాలం నాటిది!

Allu And Nandamoori

Allu And Nandamoori

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల అఖండ చిత్రం డిసెంబర్ 2, 2021న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ వేడుకకు భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్నారు.

Resize 3 11 784×441

ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. తాను అఖండ ఎఫ్‌ఎఫ్‌ఎస్ చూస్తానని అన్నారు. “బాలయ్య బాబు ఓ అణుబాంబు. దాన్ని ఎలా ట్రిగ్గర్ చేయాలో శ్రీనుకు తెలుసు. ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి. బాలయ్య బాబు తన ఎనర్జీ సీక్రెట్ కూడా చెప్పాలి. నేను కూడా అఖండ కోసం ఎదురుచూస్తున్నాను. థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోలో కలుస్తాను. అఖండ చాలా పెద్ద హిట్ కావాలి. ఇది ఇండస్ట్రీకి కొత్త ఊపు తెస్తుంది” అని RRR దర్శకుడు అన్నారు.

Balakrishna Prgna Jaiswal Acted Boyapti Srinu 1282975

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నందమూరి, అల్లు కుటుంబాల మధ్య బంధం మా తాతగారి కాలం నాటిది. నేను చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను, బాలకృష్ణ గారు నాకు తండ్రిలాంటి వారు, బాలయ్య, బోయపాటిల కాంబోలో సినిమా గురించి చెప్పనవసరం లేదు. ట్రైలర్ చూశాను.. ఇది సంచలనంగా కలిగిస్తుంది. ఈ మూవీ భారీ బ్లాక్‌బస్టర్‌ కొట్టి, కొవిడ్ సంక్షోభాన్ని అధిగమించడానికి పరిశ్రమకు సహాయం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న బిగ్గెస్ట్ సినిమా ఇదే. తెలుగు సినిమా తర్వాత అఖండ జ్యోతిలా వెలిగిపోవాలని మనమందరం కోరుకుంటున్నాము.