Allu Arjun : 69 ఏళ్ళకి మొట్టమొదటి సారి తెలుగు వాళ్ళకి నేషనల్ బెస్ట్ యాక్టర్.. పుష్పరాజ్ తగ్గేదేలే..

జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ గెలుచుకున్నారు. దీంతో అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

  • Written By:
  • Updated On - August 24, 2023 / 06:59 PM IST

అల్లు అర్జున్(Allu Arjun) 2021లో పుష్ప సినిమాతో వచ్చి అందర్నీ మెప్పించాడు. సినిమా భారీ విజయం సాధించింది. మొదటిసారి అల్లు అర్జున్ కి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది ఈ సినిమాతో. ఇక ఈ సినిమాలో యాక్టింగ్ అదరగొట్టేశాడు బన్నీ. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి బాగా హైప్ వచ్చింది. ఇప్పటికే పుష్ప రాజ్(Pushpa Raj) క్యారెక్టర్ ని దేశమంతా పొగిడేసారు.

తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులు నేడు ప్రకటించారు. 2021లో సెన్సార్ అయిన సినిమాలని పరిగణలోకి తీసుకొని 69వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించారు. ఇటీవల మన తెలుగు సినిమాలు అదరగొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నేషనల్ అవార్డుల్లో కూడా తెలుగు సినిమాలు దుమ్ము దులిపేసాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన RRR సినిమా ఏకంగా ఆరు నేషనల్ అవార్డులు గెలుచుకుంది.

ఇక జాతీయ ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ గెలుచుకున్నారు. దీంతో అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ అవార్డులు ఇస్తున్నప్పటి నుంచి ఈ 68 ఏళ్లలో ఒక్కసారి కూడా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెలుగు వారికి రాలేదు. మొట్టమొదటి సారి అల్లు అర్జున్ పుష్ప సినిమాకు గాను ఈ అవార్డు సాధించాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తో పాటు తెలుగు వారంతా, తెలుగు ప్రముఖులంతా అల్లు అర్జున్ ని అభినందిస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ అయితే ఇంత మంచి క్యారెక్టర్ ని తనకు ఇచ్చినందుకు సుకుమార్ ని హగ్ చేసుకొని ఏడ్చేశాడు. సోషల్ మీడియాలో, బయట అల్లు అర్జున్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పుష్ప సినిమాతో బన్నీ కలెక్షన్స్ తోనే కాదు అవార్డుల్లో కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. అలాగే పుష్ప సినిమాలో మరో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప సాంగ్స్ కి గాను దేవిశ్రీ ప్రసాద్ గెలుచుకున్నాడు.

 

Also Read : 69th National Film Awards : నేషనల్ అవార్డ్స్‌లో తెలుగు సినిమా సత్తా.. దుమ్ము దులిపేసిన RRR.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. తగ్గేదేలే..