Nagababu – Allu Arjun : ఏపీలో జరిగిన ఈ ఎన్నికలు జనసేన, వైసీపీ మధ్య అన్నట్లు హోరాహోరీగా సాగాయి. అయితే ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఆ యుద్ధం మెగా మరియు అల్లు ఫ్యామిలీస్ మధ్య మొదలైనట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో చివరి రోజు ప్రచారంలో అల్లు అర్జున్.. వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దుతు తెలుపుతూ నంద్యాల పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ చేసిన ఈ పని.. మెగా అభిమానులకు, జనసైనికులకు షాక్ ఇచ్చింది.
ఒక పక్క వైసీపీ పై పవన్ యుద్ధం చేస్తుంటే, అల్లు అర్జున్ ఏమో వైసీపీ లీడర్ ఇంటికి వెళ్లి మరి తన మిత్రుడిని ఎన్నికల్లో గెలిపించమనడం.. మెగా ఫ్యాన్స్‌కి, జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈక్రమంలోనే అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు వచ్చి పడుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఎన్నికలు పూర్తి అయిన తరువాత నాగబాబు ఒక సంచలన ట్వీట్ చేసారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ నాగబాబు ఒక ట్వీట్ వేశారు.
ఇక ఇది చూసిన నెటిజెన్స్ అంతా నాగబాబు అన్నది.. అల్లు అర్జునే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ట్వీట్ గురించి రీసెంట్ ప్రెస్ మీట్ లో రవిచంద్ర కిషోర్ రెడ్డిని మీడియా ప్రశ్నించింది.
దీనికి ఆయన బదులిస్తూ.. “నాగబాబు గారు ఎవర్ని ఉద్దేశించి ఆ ట్వీట్ చేసారు అన్నది అర్థంకావడం లేదు. ఒకవేళ బన్నీని ఉద్దేశించే ఆయన ట్వీట్ చేసి ఉంటే.. అది ఆయన సంస్కారానికి, విజ్ఞతకే వదిలేస్తాను. ఎందుకంటే స్నేహితులంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు. బన్నీ రాజకీయాల అతీతంగా ఆలోచించి ఒక మిత్రుడు కోసం వచ్చారు. ఆ విషయాన్ని బన్నీ కూడా వెల్లడించారు. అయినాసరి నాగబాబు గారు బన్నీ ఉద్దేశించే ట్వీట్ చేస్తే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Rey @NagaBabuOffl pic.twitter.com/YBzpdclNlJ
— CB ™ SRH (@G__0070) May 14, 2024