Allu Arjun : బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పేందుకు.. అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్

బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పేందుకు అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఫ్యాన్స్ హంగామా. వైరల్ అవుతున్న వీడియోలు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Fans Are Came To His Residence To Wish Him On Birthday

Allu Arjun Fans Are Came To His Residence To Wish Him On Birthday

Allu Arjun : నేడు ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ బర్త్ డేని ఫ్యాన్స్ అంతా ఎంతో స్పెషల్ గా భావిస్తున్నారు. ఎందుకంటే, గత పుట్టినరోజు నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ ఎన్నో ఘనతలు అందుకున్నారు. ఇటీలే నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే న్యూయార్క్ సిటీ గ్రాండ్ మార్షల్ లో పాల్గొన్న ఫస్ట్ టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ సంస్థ డాక్యుమెంటరీ చేసిన మొదటి సౌంత్ ఇండియన్ గా బన్నీ నిలిచారు. ఇక చివరిగా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పెట్టే గౌరవం అందుకున్నారు.

ఇలా ఇన్ని అరుదైన గౌరవాలు అందుకున్న తరువాత అల్లు అర్జున్ చేసుకుంటున్న పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ అంతా ఈ బర్త్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక కొంతమంది అభిమానులు.. బన్నీని కలిసి విషెస్ చెప్పేందుకు అర్ధరాత్రి తన ఇంటికి చేరుకున్నారు. హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసానికి నిన్న అర్ధరాత్రి అభిమానులు భారీగా చేరుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షులతో పాటు అరుపులు, విజుల్స్ తో తెగ సందడి చేసారు.

ఇక తన కోసం వచ్చిన అభిమానులను అల్లు అర్జున్ పలకరించడం కోసం అర్ధరాత్రి సమయంలో కూడా బయటకి వచ్చి అందరికి అభివాదం చేస్తూ.. ఫ్యాన్స్ ని ఖుషి చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉంటే, ఈరోజు పుష్ప 2 నుంచి టీజర్ రాబోతుంది. ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అన్ని భాషలకు కలిపి ఒకటే టీజర్ ని సిద్ధం చేశారట. టీజర్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది అంటున్నారు. 11.07 నిమిషాలకు ఈ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

Also read : Actor Ali : సైలెంట్ మోడ్‌లో అలీ.. వైసీపీ మొండిచెయ్యి !

 

  Last Updated: 08 Apr 2024, 09:45 AM IST