Pushpa 2 Release Date: రికార్డులే లక్ష్యంగా బన్నీ బిగ్ ప్లాన్, పుష్ప2 రిలీజ్ డేట్ ఇదే!

పుష్ప1 ఊహించని విధంగా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Published By: HashtagU Telugu Desk
Pushpa2

Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప1 ఊహించని విధంగా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ అనుకున్న తేదీకే మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ తన కుమార్తె సంగీత శిక్షణా కోర్సుకు హాజరు కావడానికి గత నెలలో యునైటెడ్ స్టేట్స్ వెళ్లడంతో “పుష్ప 2” షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.

చిత్ర నిర్మాణం ఇంకా పునఃప్రారంభించబడలేదు. ప్రస్తుతానికి చిత్రంలోని ముఖ్యమైన భాగాన్ని షూట్ చేయాల్సి ఉంది. ఇంకా 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది కాకుండా ఏప్రిల్ 2024లో సినిమాను విడుదల చేయాలనేది అల్లు అర్జున్ ఆలోచన కాబట్టి షూటింగ్‌ని పకడ్బందీగా తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఏప్రిల్‌లో విడుదలైన “కెజిఎఫ్ 2” రికార్డులను బద్దలు కొట్టడాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, వేసవి సెలవుల కాలంలో సినిమాను విడుదల చేయడం వల్ల ఎక్కువ వసూళ్లు వస్తాయని అటు అల్లు అర్జున్, ఇటు నిర్మాతలు భావిస్తున్నారు. నిర్మాణ సంస్థ ఏప్రిల్ 2024లో సినిమా కోసం అనువైన విడుదల తేదీల కోసం వెతుకుతోంది. అయితే వారి చేతిలో తగినంత సమయం ఉన్నందున, షూటింగ్ నెమ్మదిగా, అనుకున్నట్టుగా తెరకెక్కించే వీలు ఉంది. “పుష్ప 2” ఏప్రిల్ రెండవ లేదా మూడవ వారంలో విడుదల తేదీని నిర్ణయించవచ్చు.

Also Read: Eye Conjunctivitis: కళ్ల కలకతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: హరీశ్ రావు

  Last Updated: 02 Aug 2023, 11:43 AM IST