Site icon HashtagU Telugu

Allu Arjun Dance Video: ‘ఊ అంటావా పాట’కు అల్లు అర్జున్ డ్యాన్స్.. తగ్గేదే లే అంటూ!

Allu Arjun

Allu Arjun

పుష్ప ఫీవర్ టాలీవుడ్ ను ఉపేస్తోంది. పార్ట్ 1 అంచనాలకు మించి హిట్ కావడంతో, ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిగా మారుతోంది. త్వరలోనే పార్ట్-2 గ్రాండ్ లాంచ్ కాబోతోంది. అయితే పుష్ప: ది రైజ్ కు గానూ ఉత్తమ నటుడి అవార్డు (తెలుగు) SIIMA 2022లో  గెలుచుకున్నాడు అల్లు అర్జున్. అయితే అవార్డుల ఫంక్షన్ తర్వాత అల్లు అర్జున్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఊ అంటావా పాటకు మాస్ స్టెప్పులు వేస్తూ తగ్గేదేలే అంటూ ఆనందంతో ఆరిచాడు. అక్కడున్నవారిని ఎంకరేజ్ చేస్తూ డాన్స్ చేశాడు.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ (SIIMA) బెంగళూరులో జరిగింది. తెలుగు, కన్నడ సినిమాలకు విజేతలను ప్రకటించారు. ఈ అవార్డుల కార్యక్రమానికి కమల్ హాసన్, యష్, పూజా హెగ్డే, రణ్‌వీర్ సింగ్, విజయ్ దేవరకొండతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ ఫ్యాన్‌బాయ్‌గా మారిన రణవీర్ సింగ్, వేదికపై శ్రీవల్లి పాటకు నృత్యం చేస్తూ పుష్ప డైలాగ్ చెప్పారు. ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీలోని అందరినీ ఆకట్టుకున్న ‘‘ఊ అంటావా పాట’’కు స్టెప్పులు వేశాడు. బ్లాక్ కలర్ దుస్తులు ధరించి స్టైలిష్ గా డాన్స్ చేస్తూ, తగ్గేదే లే అంటూ డైలాగ్ చెబుతూ పాటకు డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.