National Awards 2024 లో దక్షణాది చిత్రాలు సత్తా చాటాయి. కాంతారా చిత్రంలోని నటనకు గాను రిషబ్ శెట్టి (Rishab Shetty )కి నేషనల్ అవార్డు (National Award) దక్కగా..కార్తికేయ 2 కు గాను ఉత్తమ చిత్ర అవార్డు దక్కింది. ముఖ్యంగా రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు రావడం పట్ల అన్ని చిత్రసీమ ప్రముఖులు , సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన స్పందనను తెలియజేసారు. “నేషనల్ అవార్డులు గెలుచుకున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ తన సోషల్ మీడియాలో బన్నీ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు రిషబ్ శెట్టి ‘థాంక్యూ బ్రదర్’ అని రిప్లై ఇచ్చారు.
2022 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను సమాచార, ప్రసార శాఖ (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీన నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలను వెల్లడించింది. గతేడాది అల్లు అర్జున్‍కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కగా.. ఇప్పుడు మరోసారి దక్షిణాది నటుడికే ఈ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ‘ఆట్టం’ నేషనల్ అవార్డు దక్కించుకుంది. ఈ మూవీ 2024లో థియేటర్లలో రిలీజైనా.. 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక, తెలుగులో 2022కు గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. గతేడాది తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కగా.. ఈసారి కార్తికేయ 2కు మినహా మరే పురస్కారం దక్కలేదు.
ఇక కాంతారా విషయానికి వస్తే..
2022లో కన్నడలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. కేవలం 20 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమా 400 కోట్లు కలెక్ట్ చేయడమే కాక కన్నడ లోకల్ సంసృతి, సాంప్రదాయాలు అద్భుతంగా చూపించారని, రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడని దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.
Read Also : Life Goal: మీరు విజయం సాధించాలంటే, మీరు సిగ్గు లేకుండా ఈ 4 పనులు చేయాలి..!