Site icon HashtagU Telugu

Allu Arjun : నాకు పౌరాణికాలు చేయాలంటే భయం.. బాలయ్య షోలో అల్లు అర్జున్ వ్యాఖ్యలు..

Allu Arjun Special Video

Allu Arjun Special Video

Allu Arjun : ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ దేశమంతా విస్తరిస్తుంది. పుష్ప సినిమాతో మంచి క్రేజ్ రాగా పుష్ప 2 సినిమాతో ఆ స్థాయిని మరింత పెంచాలి అనుకుంటున్నాడు బన్నీ. దీంతో పుష్ప 2 ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇవాళ ట్రైలర్ లాంచ్ బీహార్ పాట్నాలో జరగనుంది. అయితే అల్లు అర్జున్ ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చాడు.

బాలయ్య – అల్లు అర్జున్ ఎపిసోడ్ రెండు రోజుల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉండటం గమనార్హం. ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. బాలయ్య కూడా అనేక ప్రశ్నలు అడిగి అల్లు అర్జున్ తో సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో బాలయ్య సినిమాల గురించి మాట్లాడుతూ.. మనం పౌరాణికం చేద్దాం అని అన్నారు.

దీనికి అల్లు అర్జున్.. నాకు పౌరాణికాలు చేయాలంటే భయం. ఒకవేళ చేయాల్సి వస్తే మీ దగ్గరికి ట్రైనింగ్ కి వస్తాను అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల మైథలాజికల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. చాలా మంది హీరోలు ఇవి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ.. లాంటి సీనియర్ హీరోలు ఎన్నో పౌరాణిక సినిమాలు చేసి మెప్పించారు. బాలయ్య కూడా కొన్ని పౌరాణిక సినిమాల్లో నటించారు. ఇప్పుడు అల్లు అర్జున్ పౌరాణికాలు చేయాలంటే భయం అని అనడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా బన్నీ ని పౌరాణిక పాత్రల్లో చూడలేమా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

 

Also Read : SS Kumaran : నయనతారపై నిర్మాత విమర్శలు.. మీరు నన్ను తొక్కేశారు.. కానీ ధనుష్ ని మాత్రం అలా అంటారా?

Exit mobile version