Site icon HashtagU Telugu

Allu Arjun In Tanzania : ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఐకాన్ స్టార్

Allu Arjun

Allu Arjun

సుకుమార్ దర్శకత్వం లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ సీక్వెల్ పై వర్క్ చేస్తున్నాడు. అయితే పుష్ప-2 సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ఆ గ్యాప్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో సరాదాగా గడుపుతున్నాడు. ప్రస్తుతం టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో ఫ్యామిలీతో చిల్ అవుతున్నాడు. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేసింది. అల్లు అర్జున్ తన భార్య, కొడుకు అల్లు అయాన్, కుమార్తె అల్లు అర్హతో సరదాగా గడిపారు. అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పుష్ప: ది రూల్’ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, సెట్స్ మీదికి వెళ్లేలోపు హైదరాబాద్ రావాలని భావిస్తున్నాడు. శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్న సీక్వెల్‌లో పెద్ద పాత్ర పోషిస్తుందని మేకర్స్ తెలిపారు.

Exit mobile version