Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డమ్ ని సంపాదించుకోవడమే కాదు, నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. రెండు భాగాలుగా రూపొందిన పుష్ప మొదటి భాగం నేషనల్ వైడ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాహుబలి 2, కెజీఎఫ్ 2కి ఉన్నంత క్రేజ్ పుష్ప 2కి కూడా వచ్చింది.
దీంతో పుష్ప 2 కూడా బాహుబలి, కెజీఎఫ్ లా కొత్త రికార్డులను సృష్టిస్తుందని అందరూ భావించారు. అల్లు అర్జున్ అభిమానులు అయితే పుష్ప 2తో అద్భుతమైన రికార్డులు నమోదు అవ్వడం ఖాయం అని ఫిక్స్ అయ్యిపోయి ఉన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్ తీసుకున్న ఒక నిర్ణయం పుష్ప 2కి పెనుముప్పుగా మారేలా కనిపిస్తుంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ కి మద్దతు తెలుపుతూ నంద్యాల పర్యటన చేయడం జనసైనికులకు, మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
ఇక ఆ తరువాత.. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే” అంటూ నాగబాబు చేసిన ట్వీట్ తో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చినీయాంశంగా మారింది. ఈ విషయంలో ఇతర ఫ్యాన్‌డమ్స్ కూడా అల్లు అర్జున్ ని తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదేళ్ల నుంచి వైసీపీ పై పోరాటం చేస్తుంటే.. అల్లు అర్జున్ చివరి రోజున వైసీపీ లీడర్ ని కలవడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Oh my @alluarjun
This will not end here I guess☠️ pic.twitter.com/cTa444WuCQ— Jan 12th 🌶️ (@RangulaRangoli_) May 14, 2024
ఈ నెగటివిటీ పుష్ప 2కి ముప్పు కానుంది. గతంలో కూడా పవన్ అభిమానులతో అల్లు అర్జున్ కి సమస్య వచ్చింది. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ అంతా కలిసి ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకి చాలా నెగటివిటీ తీసుకొచ్చి సినిమా కలెక్షన్స్ విషయం పెద్ద ఇబ్బంది కలగజేసారు. ఇప్పుడు పుష్ప 2కి అదే రిపీట్ అయ్యేలా కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.