Allu Arjun: ‘RRR’ పై ‘ఐకాన్ స్టార్’ ప్రశంసల వర్షం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రిబుల్ ఆర్ సినిమా చూసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రిబుల్ ఆర్ సినిమా చూసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఇంత గొప్ప సినిమా అందించినందుకు దర్శక ధీరుడు రాజమౌళికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు అల్లు అర్జున్. రాజమౌళి గారి విజన్ కు అల్లు అర్జున్ ఫిదా అయిపోయారు. చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని.. ఆయనను చూసి ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు అల్లు అర్జున్. మరోవైపు తన బావ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అర్జున్.

తారక్ నటనను డైనమిక్ పవర్ హౌస్ తో పోల్చారు బన్నీ. అలాగే కీలకమైన పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ నటనను కూడా పొగిడారు అల్లు అర్జున్. సంగీత దర్శకుడు కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత డివివి దానయ్య.. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు అల్లు అర్జున్. ఇండియా గర్వించదగ్గ త్రిబుల్ ఆర్ సినిమా ఇచ్చినందుకు వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  Last Updated: 27 Mar 2022, 11:26 AM IST