Site icon HashtagU Telugu

Allu Arjun Birthday : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్

Bunny Bday Spl

Bunny Bday Spl

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే (Allu Arjun Birthday) ఈరోజు. ఈ సందర్భాంగా వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ అభిమానులు బర్త్ డే సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుండి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖుల దగ్గరి నుండి అభిమానుల వరకు బన్నీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ హోరెత్తిస్తున్నారు.

1982 ఏప్రిల్ 8న జన్మించిన ఈయన.. అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడు. బాలనటుడిగా పలు సినిమాల్లో కనిపించిన బన్నీ.. 2002 మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో డాన్సర్ లా కనిపించాడు. 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి పరిచమయ్యాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన బన్నీ.. 2004లో సుకుమార్ డైరెక్షన్లో ఆర్య తో వచ్చి యూత్ కు దగ్గరయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ..ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పుష్ప తో దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

20ఏళ్ల కేరీర్​లో అల్లు అర్జున్ (Allu Arjun) సినీ కెరియర్ లో ఎన్నో రికార్డ్స్ తనపేరుపై రాసుకున్నాడు. ఇన్​స్టాగ్రామ్​ థ్రెడ్స్ యాప్​లో ఒక్క ఫొటో పోస్ట్​తో 1 మిలియన్ ఫాలోవర్ అందుకున్న తొలి యాక్టర్ గా అల్లు అర్జున్ రికార్డు నెలకొల్పాడు. ఇన్‌స్టాగ్రామ్ డాక్యుమెంటరీ వీడియో చేసిన మొదటి హీరో కూడా అల్లు అర్జునే కావడం విశేషం. ఇందులో పుష్ప 2 సెట్స్​తో పాటు బన్నీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చూపించారు. అలాగే యూట్యూబ్​లోనూ అత్యధిక 300 మిలియన్ల వ్యూస్​ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా బన్నీ నటించిన సర్రాయినోడు నెలకొల్పింది. ఇక యూట్యూబ్​లో 5 బిలియన్ల వ్యూస్ దాటి సెన్సేషనల్ క్రియేట్ పుష్ప సినిమా కూడా బన్నీ ఖాతాలోనేది. తెలుగు వాళ్లకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన నేషనల్ అవార్డు అల్లు అర్జున్​కు తెచ్చిపెట్టింది. బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు యాక్టర్ బన్నీనే కావడం విశేషం. అలాగే దుబాయ్​లోని మేడమ్‌ టుస్సాడ్స్​లో మైనపు విగ్రహం ఉన్న మొదటి టాలీవుడ్ యాక్టర్, తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా బన్నీనే కావడం విశేషం. ఇలా ఎన్నో అవార్డ్స్ , రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2)షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : Solar Eclipse 2024: ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం.. మరి భారత్‌లో కనిపిస్తుందా?