Allu Arjun : పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు. పుష్ప 2 తర్వాత ఇంకా ఏ సినిమా అనౌన్స్ చేయలేదు. ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ కి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత దుబాయ్ కి అట్లీ సినిమా కథ కోసం సిట్టింగ్స్ కి వెళ్లారు. ప్రస్తుతం బన్నీ ఇంట్లోనే ఫ్యామిలీతో ఉంటున్నాడు.
నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ లతో కలిసి కేక్ కట్ చేసాడు. ఈ ఫోటోని స్నేహ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ కేక్ కట్ చేస్తున్న ఫోటో వైరల్ గా మారింది. పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Allu Arjun Birthday
నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించనున్నారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ నెట్ వర్క్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై అనేక హింట్స్ ఇచ్చారు. నేడు అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : Peddi : ‘పెద్ది’ టీజర్ పై అల్లు శిరీష్ ట్వీట్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్