Allu Arjun Impact: సౌత్ లో ‘ఒకే ఒక్కడు’ అల్లు అర్జున్!

ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun

Allu Arjun

ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఆయన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు కానీ గతంలోలాగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎందుకంటే తను చాలా సీనియర్ కాబట్టి తన వయసుకు తగ్గ సినిమాలు చేయడం లేదు. ఇక టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రభావం బాగానే ఉంది. అయితే ఆయన గత మూడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలమయ్యాయ.

ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు టాలీవుడ్ కే పరిమితమయ్యారు. అలాంటి టైమ్‌లో అల్లు అర్జున్ ఒక్క సినిమాతో ప్రపంచానికి తానేంటో చూపించాడు. ‘పుష్ప’ సినిమా మొదట తెలుగులో విడుదలై, తర్వాత అన్ని భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. అంతే కాకుండా ఓ ప్రముఖ జాతీయ పత్రిక తన కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటోను ముద్రించి కథనం రాసింది. అజిత్, విజయ్ లాంటి తమిళ నటులు కూడా ఈ రేంజ్ లో ముందుకు సాగలేదట. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి నటులు ప్రాతినిధ్యం వహించిన సౌత్ సినిమాకి ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతినిధిగా మారాడు.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ‘పుష్ప’ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అలాంటి ఘనత సాధించాడంటే ఆ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌కే దక్కుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తే ‘పుష్ప’ క్యారెక్టర్‌ను కాన్సెప్ట్ చేసింది ఆయనే. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కష్టానికి ఎలాంటి ఫలితం దక్కిందో కూడా ఈ సినిమాలో తెలిసిపోయింది. అందుకే ‘పుష్ప’ రెండో భాగాన్ని మొదటి భాగం కంటే అద్భుతంగా, అంతర్జాతీయంగా తెరకెక్కించాలని అల్లు అర్జున్, సుకుమార్ భావిస్తున్నారట.

  Last Updated: 07 Sep 2022, 02:19 PM IST