Site icon HashtagU Telugu

Allu Arjun Vs Deverakonda: విజయ్ దేవరకొండను దాటేసిన బన్నీ.. ఇన్ స్టాలో ఐకాన్ స్టార్ మెరుపులు!!

Alluarjun Deverakonda Imresizer

Alluarjun Deverakonda Imresizer

స్టార్ హీరోలకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

అందులోనూ మన టాలీవుడ్ స్టార్స్ కు భలే క్రేజీ ఉంటుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర గణాంకాలు విడుదల అయ్యాయి. వాటి ప్రకారం ఇన్ స్టాగ్రామ్ అత్యధిక ఫాలోయర్స్ కలిగిన స్టార్స్ జాబితాలో పోటీ పెరిగింది. ఇంతకుముందు వరకు దక్షిణాది స్టార్స్ లిస్టులో నంబర్ 1 స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండ ను అల్లు అర్జున్ దాటేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను ఇన్ స్టాగ్రామ్ లో 1.88 కోట్ల మంది ఫాలో అవుతుండగా.. రెండో స్థానంలో ఉన్న విజయ్ దేవరకొండను 1.69 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. బన్నీ తన భార్య స్నేహారెడ్డిని  మాత్రమే సోషల్ మీడియాలో ఫాలో అవుతుండగా బన్నీ ఇప్పటివరకు 544 పోస్టులు చేశారు. ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉండటంతో బన్నీకి ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది.

ఇక ఈ లిస్ట్ లో kgf స్టార్ హీరో యశ్ 1.11 కోట్ల మంది ఫాలోయర్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు. మమ్ముట్టి కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ కూడా 1.11 కోట్ల ఫాలోయర్స్ తో మూడో ర్యాంక్ పొందాడు. వీరి తర్వాతి స్థానాల్లో వరుసగా మహేష్ బాబు (87 లక్షల ఫాలోయర్స్), ప్రభాస్ (86 లక్షల ఫాలోయర్స్),
రామ్ చరణ్ తేజ్ (82 లక్షల ఫాలోయర్స్),జూనియర్ ఎన్టీఆర్ (45 లక్షల ఫాలోయర్స్) ఉన్నారు.

ఇక ఫేస్ బుక్ లోనూ ప్రభాస్ కు ఫేస్ బుక్ లో 24 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఫేస్ బుక్ లో బన్నీ, మహేష్ బాబులకు కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది

అభిమానులకు బన్నీ థ్యాంక్స్..

అభిమానులు, ఫాలోవ‌ర్ల సంఖ్య మిలియ‌న్ల‌లో పెరిగిన సంద‌ర్భంగా.. అంద‌రి ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు..అని ట్వీట్ చేస్తూ మోన్ క్రోమ్ స్టిల్ ఒకటి షేర్ చేశాడు బ‌న్నీ. ఈ ట్వీట్‌తోపాటు బ‌న్నీ లుక్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సుకుమార్ డైరెక్ష‌న్‌లో అల్లు అర్జున్ చేయ‌నున్న పుష్ప..ది రూల్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. పుష్ప చిత్రం తెలుగు, హిందీ, మ‌ల‌యాళంతోపాటు వివిధ భాష‌ల్లో విడుద‌లై నిర్మాత‌ల‌కు కాసుల పంట పండించింది. పుష్ప 2పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

గంగోత్రి సినిమాతో సోలో హీరోగా కెరీర్ ప్రారంభించాడు..ఆ త‌ర్వాత దేశ‌ముదురు, ఆర్య చిత్రాల‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కెరీర్‌లో సూప‌ర్ హిట్ చిత్రాల‌ను అభిమానుల‌కు అందించిన అల్లు అర్జున్ (Allu Arjun) ఈ ఏడాది పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో నార్త్‌లో కూడా ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు బ‌న్నీ. పుష్ప (Pushpa) ఇచ్చిన స్టార్ డ‌మ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఐకాన్ స్టార్‌గా మారిన బ‌న్నీ ప్ర‌స్తుతం కోకా కోలా, కేఎఫ్‌సీ లాంటి మ‌ల్టీపుల్ బ్రాండ్స్ ప్ర‌మోష‌న్స్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.