Salman Khan : అల్లు అర్జున్ నుంచి సల్మాన్ వద్దకి వెళ్లిన కథ.. వచ్చే ఏడాది ప్రారంభం..!

అల్లు అర్జున్ నుంచి సల్మాన్ వద్దకి వెళ్లిన కథ. అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయాల్సిన సినిమా ఆగిపోయిందట. ఇప్పుడు ఆ కథ..

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 04:22 PM IST

Salman Khan : బాలీవుడ్ హీరోలంతా సౌత్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ సౌత్ డైరెక్టర్స్ తో జవాన్, యానిమల్ వంటి సినిమాలు చేసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ని అందుకున్నారు. దీంతో ఇతర నార్త్ స్టార్స్ కూడా అలాంటి ఓ భారీ విజయం అందుకునేందుకు సౌత్ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతున్నారు. ఈక్రమంలోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ దర్శకుడు మురగదాస్ తో ‘సికందర్’ అనే సినిమాకి సైన్ చేసారు.

రీసెంట్ గా ఇప్పుడు మరో సౌత్ డైరెక్టర్ కి కూడా సల్మాన్ ఖాన్ ఓకే చెప్పారట. షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన తమిళ దర్శకుడు అట్లీతో సల్మాన్ ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారట. ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో సినిమా చేస్తున్న అట్లీ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో అట్లీ ఆ సినిమా కథని తీసుకువెళ్లి సల్మాన్ ఖాన్ కి వినిపించారట. కథ విన్న సల్మాన్ ఖాన్.. సినిమా చేసేందుకు అట్లీకి ఓకే చెప్పారట. ఈ సినిమాని వచ్చే ఏడాది పట్టాలు ఎక్కించనున్నారట. ఈలోపు సల్మాన్ ఖాన్ తన ‘సికందర్’ సినిమాని, అట్లీ-వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ ని పూర్తి చేయనున్నారు.

సికందర్ సినిమా విషయానికి వస్తే.. డాన్ బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతుందని సమాచారం. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న, విలన్స్ గా కార్తికేయ, అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్ నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Also read : Pushpa 2 : పుష్ప 2 నిజంగా వాయిదా పడుతుందా..? కారణం మెగా వెర్సస్ అల్లు..!