Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమా అనౌన్స్.. ఈ సారి హాలీవుడ్ రేంజ్ లో.. వీడియో వైరల్..

నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీతో నెక్స్ట్ సినిమాని అధికారికంగా ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Atlee Movie Officially Announced under Sun Pictures Banner

Aa22

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్, అట్లీతో సినిమాలు చేస్తాడని వార్తలు వస్తున్నాయి. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీతో నెక్స్ట్ సినిమాని అధికారికంగా ప్రకటించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమాని నేడు ప్రకటించారు.

ఇది అల్లు అర్జున్ కి 22వ సినిమా కాగా అట్లీకి 6వ సినిమా. ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేసారు. ఈ వీడియోలో అల్లు అర్జున్, అట్లీ కలిసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కి వెళ్లినట్టు, అక్కడ హాలీవుడ్ సినిమాలకు పనిచేసే సాంకేతిక నిపుణులు, సంస్థలతో మాట్లాడినట్టు చూపించారు.

ఈ వీడియో చూస్తుంటే ఈసారి అల్లు అర్జున్ హాలీవుడ్ స్టైల్ లో యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ బాడీ, ఫేస్ నమూనాలు VFX కోసం కూడా తీసుకున్నట్టు చూపించారు. బ్యాట్ మెన్, స్పైడర్ మ్యాన్.. లాంటి సినిమాల్లాగా ఉంటుందని ఈ వీడియో చూసి ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ తో భారీ కమర్షియల్ సినిమాని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న అట్లీ – అల్లు అర్జున్ కలిసి ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాలి .

 

Also Read : Bobby : బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ టాలీవుడ్ డైరెక్టర్.. హృతిక్ రోషన్ తో..

  Last Updated: 08 Apr 2025, 11:28 AM IST