Site icon HashtagU Telugu

AAA : వామ్మో అల్లు అర్జున్ మూవీ బడ్జెట్ రూ.800 కోట్లా..?

Aaa Movie

Aaa Movie

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్‌లో గోల్డెన్ ఫేజ్‌ను అనుభవిస్తున్నారు. ‘పుష్ప 2’ వంటి బ్లాక్ బస్టర్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు మరో భారీ సినిమాకు సిద్ధమవుతున్నారు. అట్లీ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి రూ.800 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.

Signature Global : ప్రీ-సేల్స్ రూ. 102.9 బిలియన్లు నమోదు చేసిన సిగ్నేచర్ గ్లోబల్

ఈ భారీ బడ్జెట్‌లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్‌ రూ.175 కోట్లు, దర్శకుడు అట్లీకి రూ.125 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ‘సన్ పిక్చర్స్’ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఈ చిత్రంలో ప్రతీ అంశాన్ని గ్రాండ్‌గా రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సెట్స్‌కు పెద్ద ఎత్తున ఖర్చు చేయనున్నారట. అయితే ఈ వార్తలపై మేకర్స్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయినా, అట్లీ – బన్నీ కాంబోతో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక కథానాయికల విషయంలో కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఉండనుంది. ఐదుగురు హీరోయిన్స్‌లో ముగ్గురు విదేశీ భామలు ఉండనున్నట్టు టాక్. ప్రధాన హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేస్తోంది. కథ, పాత్రల ఎంపిక, విజువల్స్ అన్నింటిలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించనున్న ఈ చిత్రం త్వరలోనే అధికారికంగా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశముంది.