Site icon HashtagU Telugu

Allu Arjun : అల్లు అర్జున్, అట్లీ మూవీ ఆగిపోయిందట.. కారణం అదేనట..!

Allu Arjun Atlee Kumar Project Is Shelved News Gone Viral

Allu Arjun Atlee Kumar Project Is Shelved News Gone Viral

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత రెండేళ్లుగా తన ఫుల్ కాల్ షీట్స్ ని పుష్ప 2కే కేటాయించేసారు. ఇక్కడి వరకు అంతా ఓకే, కానీ ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేదే క్లారిటీ లేదు. అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, సందీప్ వంగ, అట్లీ పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. వీటిలో అట్లీ మూవీ ముందుగా పట్టాలు ఎక్కనుందని, దీనిని అల్లు హోమ్ బ్యానర్ గీతాఆర్ట్స్ నిర్మించబోతుందని వార్తలు వచ్చాయి.

అట్లీ కూడా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లు కూడా కామెంట్స్ వినిపించాయి. ఇక ఇవ్వన్నీ విన్న బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అట్లీ.. బన్నీతో సినిమా చేయబోతున్నాడంటే ఫ్యాన్స్ తెగ సంబర పడ్డారు. అయితే ఇప్పుడు ఆ సంబరాలకు షాక్ ఇచ్చేలా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. ఇందుకు గల కారణం అట్లీ అడిగిన రెమ్యూనరేషన్ అని సమాచారం.

అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు అట్లీ అక్షరాలా రూ.80 కోట్ల రెమ్యూనరేషన్ అడిగారట. ప్రస్తుతం ఉన్న పలువురు పాన్ ఇండియన్ హీరోలు కూడా ఇంతటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. అలాంటిది అట్లీ అంతటి పారితోషకం అడగడం అందర్నీ షాక్ కి గురి చేసింది. నిర్మాత అల్లు అరవింద్ సైతం షాక్ కి గురై.. అట్లీకి నో చెప్పారట. దీంతో ప్రాజెక్ట్ అటక ఎక్కినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు.