Site icon HashtagU Telugu

Allu Arjun : నంద్యాల వైసీపీ లీడర్ ఇంటిలో అల్లు అర్జున్.. భారీ ప్రభంజనం..

Allu Arjun At Nandyal Campaign For Ysrcp Candidate Ravi Chandra Kishore Reddy

Allu Arjun At Nandyal Campaign For Ysrcp Candidate Ravi Chandra Kishore Reddy

Allu Arjun : ఇటీవలే పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. నేడు వైసీపీ లీడర్ కి మద్దతు తెలుపుతూ జనసైనికులకు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పవన్ ప్రథమ లక్ష్యం వైసీపీని గద్దె దించడం. అందుకోసం పవన్ కళ్యాణ్ తన నాయకుల సీట్స్ ని త్యాగం చేసి మరి పోరాడుతున్నారు. అలంటి వైసీపీ లీడర్ కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం.. మెగా అభిమానులను, జనసైనికులను ఆగ్రహానికి గురి చేస్తుంది.

అల్లు అర్జున్ స్నేహితుడైన రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో మిత్రుడు గెలుపు కోసం అల్లు అర్జున్ నేడు తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి మద్దతు తెలిపేందుకు వెళ్లారు. ఇక అల్లు అర్జున్ రాకతో రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటి వద్దకి బన్నీ అభిమానులు, వైసీపీ మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. ఇక భారీగా తరలి వచ్చిన ఆ ప్రభంజనానికి.. అల్లు అర్జున్ బయటికి వచ్చి అభివాదం చేయడమే కాకుండా, రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలంటూ తన చెయ్యి ఎత్తి ప్రజలను కోరారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలు చూసిన జనసైనికులు అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు అల్లు అభిమానులు సైతం.. అల్లు అర్జున్ ఇలా ఇంటికి వచ్చి కాకుండా స్నేహితుడికి ఫోన్ లోనే విషెస్ తెలియజేసి ఉంటే బాగుండని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇలా ఇంటికి వచ్చి విషెస్ తెలియజేయడంతో.. వైసీపీ లీడర్స్ జనసేనకి వ్యతిరేకంగా దీనిని ఉపయోగించుకుంటున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, అల్లు అర్జున్ తండ్రి అరవింద్.. రామ్ చరణ్ తో కలిసి నేడు పిఠాపురం వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ ని కలిసి జనసేనకి తన మద్దతుని తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ఒక ట్వీట్ వేశారు.