Allu Arjun Army: ‘అల్లు ఆర్మీ’ ఓవరాక్షన్.. అభిమానులపై నెటిజన్స్ ట్రోలింగ్!

తమ అభిమాన నటుడి రాబోయే చిత్రం గురించి అప్‌డేట్‌లు రానప్పుడు అభిమానులు నిరాశ చెందడం సహజం. అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో

Published By: HashtagU Telugu Desk
Allu Army

Allu Army

తమ అభిమాన నటుడి రాబోయే చిత్రం గురించి అప్‌డేట్‌లు రానప్పుడు అభిమానులు నిరాశ చెందడం సహజం. అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో కూడా అదే జరుగుతోంది. మొదటి భాగం పుష్ప-1 విడుదలై ఒక సంవత్సరం అయ్యింది. అప్పటి నుండి దాని సీక్వెల్ సంబంధించి ఎలాంటి అప్టేడ్స్ ప్రకటించలేదు. ‘అల్లు ఆర్మీ’ అని పిలువబడే అల్లు అర్జున్ అభిమానులు నిన్న ఆదివారం గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నిరసన చేయడం చర్చనీయాంశమవుతోంది. నిజానికి గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్‌కి పుష్ప 2తో ఎలాంటి సంబంధం లేదు.

నిజంగా అప్‌డేట్ కావాలంటే పుష్ప 2కి అధికారిక నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కాబట్టి, ఆ ఆఫీస్ బయట నిరసన తెలపాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో “ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యరు అల్లు అర్జున్ ఆర్మీ!” అని నెటిజన్స్ అంటున్నారు. సినిమాపై మరికొంత హైప్‌ని క్రియేట్ చేయడానికి వెర్రి అభిమానులు చేస్తున్న జిమ్మిక్కులు తప్ప మరేమీ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. షూటింగ్, విడుదల తేదీ, ఇతర వివరాల గురించి అప్‌డేట్‌లను ఇవ్వడానికి పుష్ప టీమ్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. డిసెంబరు 16న విడుదల కాబోతున్న అవతార్ 2 ప్రదర్శనలో టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో మేకర్స్ నుండి వచ్చే అవకాశం ఉంది.

  Last Updated: 15 Nov 2022, 11:36 AM IST