Site icon HashtagU Telugu

Allu Arjun : ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్..

Allu Arjun Appreciates Telangana Cm Revanth Reddy Tweet goes Viral

Allu Arjun Cm Revanth Reddy

Allu Arjun : అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2(Pushpa) సినిమా కోసం రాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ(Telangana) ప్రభుత్వం రూల్ ప్రకారం అల్లు అర్జున్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ వీడియో చేసారు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ యాంటీ డ్రగ్స్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ డ్రగ్స్ తీసుకోవద్దని, ఎవరైనా తీసుకుంటే 1908కు కాల్ చేసి చెప్పాలని, వాళ్ళని ప్రభుత్వం మారుస్తుందని తెలిపారు.

ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తెలంగాణ పిల్లలు, యువతను డ్రగ్స్ నుంచి కాపాడే ప్రయత్నంలో అవగాహన వీడియో చేసినందుకు అల్లు అర్జున్ కి ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యకరమైన సమాజం కోసం చేతులు కలపాలి అంటూ ట్వీట్ చేసారు. అయితే ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందించారు.

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందిస్తూ.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మరియు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి విముక్తి చేయడానికి మీరు తీసుకున్న చొరవ అభినందనీయం. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. అలాగే నేను మీరు తీసుకున్న మంచి నిర్ణయాలు మరిన్ని చూస్తున్నాను అంటూ అభినందించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి అభిమానులు బన్నీ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

 

Also Read : Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ స‌మంత‌కే ఎందుకిలా?