Site icon HashtagU Telugu

Pushpa in Russia: తగ్గేదేలే.. రష్యాలో గ్రాండ్ రిలీజ్ కానున్న పుష్ప!

Pushpa disaster allu arjun

Pushpa 2

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప: ది రైజ్ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి తెలుగులో రూపొందిన అల్లు అర్జున్ పుష్ప హిందీ వెర్షన్ ఉత్తరాదిలో కూడా ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఇటు అల్లు అర్జున్, అటు రష్మిక మందాన్నకు ప్లస్ అయ్యింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో రష్యాలో కూడా విడుదల సిద్ధమవుతోంది పుష్ప మూవీ.

“మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ అద్భుతమైన స్పందన తర్వాత పుష్ప పార్ట్ 1ని డిసెంబర్‌లో రష్యాలో విడుదల చేయడానికి టీమ్ అంతా ఉత్సాహంగా ఉంది. ఐకాన్ స్టార్ షెడ్యూల్‌ను బట్టి, మేకర్స్ విడుదలను లాక్ చేస్తారు. చిత్ర ప్రమోషన్ల కోసం అల్లు అర్జున రష్యాను విజిట్ చేయనున్నట్టు  తెలుస్తోంది. పుష్ప-1 సక్సెస్ జోష్ ఉన్న అల్లు అర్జున్ పార్ట్-2 కోసం బ్యాంకాంక్ లో ఉన్నట్టు, అక్కడ శరవేగంగా షూటింగ్ జరుపుతున్నట్టు, త్వరలో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.