Allu Arjun అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా మంగళవారం. ఈ సినిమాను స్వాతి రెడ్డి నిర్మించారు. సినీమ ఈ నెల 17న రిలీజ్ అవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు. ఈ సినిమా టీజర్ చూశాక చాలా ఆసక్తికరంగా ఉందనిపించింది. సుకుమార్ గారికి ఈ టీజర్ నచ్చింది. ఇక ట్రైలర్ అయితే సంథింగ్ మంచి వైబ్ ఉందనిపించింది. టీజర్ చూసి షాక్ అయ్యి అజయ్ నాకు ఏం చెప్పాడో అదే తీశాడనిపించింది.
ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం స్వాతి రెడ్డి. తన కోసమే ఈ వేడుకకు వచ్చాను. పాయల్ రాజ్ పుత్ కి ఈ సినిమా మరో మైల్ స్టోన్ అవ్వాలని అన్నారు. RX 100 సినిమా తనకు ఇష్టమని అందులోని పిల్లా రా సాంగ్ ఇప్పటికీ మా ఇంట్లో తరచు వింటామని అన్నారు. ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరారు అల్లు అర్జున్.
Also Read : Bigg Boss 7 : ఆమె ప్లేస్ లో అతను.. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటున్న ఆడియన్స్..!
ఇక పుష్ప 2 (Pushpa 2) గురించి కూడా హింట్ ఇచ్చారు అల్లు అర్జున్. జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుందని అన్నారు. అందరికీ ఫ్యాన్స్ ఉంటే తనకు మాత్రం ఆర్మీ ఉందని అన్నారు. అల్లు అర్జున్ ఎంట్రీతో మంగళవారం ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది.
పాయల్ రాజ్ పుత్ కి ఆరెక్స్ 100 తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారంతో మరోసారి ఆమెకు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు.
We’re now on WhatsApp : Click to Join