Site icon HashtagU Telugu

Allu Army : అల్లు ఆర్మీ మొదలైంది ఇక్కడే అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపిన అల్లు అర్జున్

Bunny Kochi

Bunny Kochi

అల్లు అర్జున్ (AlluArjun) – రష్మిక కలయికలో తెరకెక్కిన పుష్ప 2 (Pushpa 2)మూవీ డిసెంబర్ 05 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని యావత్ అభిమానులు , సినీ ప్రముఖులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో మేకర్స్ అన్ని భాషల్లో ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తూ అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై లో భారీ ఈవెంట్ జరిపిన మేకర్స్..ఈరోజు కేరళలో మరో ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..డైరెక్టర్ సుకుమార్ వల్లే తనకు మలయాళంలో కూడా అభిమానులు ఉన్నారని అన్నారు. పుష్ప 2 కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇకపై ఇంత ఆలస్యం చేయను. వీలైనంత త్వరగా నా సినిమాలు రిలీజ్ చేయిస్తా అన్నారు. అలాగే అల్లు ఆర్మీ (Allu Army ) మొదలైంది ఇక్కడే అని అల్లు అర్జున్ ను కాస్త మీరు మల్లు అర్జున్ గా మార్చారు. ధన్యవాదాలు’ అంటూ అభిమానుల్లో జోష్ నింపారు.

అలాగే రష్మిక సైతం తగ్గేదేలే అంటూ ఈవెంట్ లో జోష్ నింపింది. ‘నా సామి’ పాటకు రష్మిక (Rashmika Dance) స్టేజీపై స్టెప్పులేసి కుర్రకారును ఆకట్టుకుంది. చీరకట్టులో తనదైన స్వాగ్తో డాన్స్ చేశారు. రష్మిక స్టెప్పులకు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటె..పుష్ప-2 నుంచి మరో పాట ప్రోమోను అల్లు అర్జున్ కేరళలో రిలీజ్ చేశారు. సినిమా మొత్తం 6 భాషల్లో విడుదల కానుండగా అన్నింటిలోనూ ఈ పాట మలయాళం లిరిక్స్లోనే ఉండనుంది. బన్నీ ఈ విషయాన్ని తన స్పీచ్లో తెలిపారు. కేరళ ప్రజలకు తన ప్రేమను ఈ పాట రూపంలో అందిస్తున్నానని పేర్కొన్నారు. ‘పీలింగ్స్’ పేరుతో మంచి క్యాచీ బీట్ ఉన్న ఈ పాటలో తాను డాన్స్ బాగా వేసినట్లు బన్నీ చెప్పుకొచ్చాడు.

Read Also : Kohli Captain In IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. కింగ్‌కే ప‌గ్గాలు అని చెప్పే కార‌ణాలివే!