పాన్ ఇండియా మొత్తం ఇప్పుడు పుష్ప రాజ్ మేనియా నడుస్తుంది. మొన్న పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఆదివారం చెన్నైలో పుస్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చెన్నై ఈవెంట్ లో కూడా భారీ జన సందోహం ఏర్పడింది. దీన్ని బట్టి పుష్ప 2 పై పాన్ ఇండియా బజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ పెట్టలేదు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే పుష్ప 2 (Pushpa 2) కి సంబందించి పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ అంతా కలిసి అక్కడ సంగం థియేటర్ దగ్గర భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు.
108 అడుగుల కటౌట్..
ఇదివరకు ఏ హీరోకి లేనంత విధంగా ఏకంగా 108 అడుగుల కటౌట్ ని సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ కటౌట్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 సినిమాను ప్రేక్షకులు ఎన్ని అంచనాలతో వస్తారో దానికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ (Sukumar).
ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా లేటెస్ట్ గా వచ్చిన కిసిక్ సాంగ్ కూడా సూపర్ అనిపించుకుంది. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా పై నేషనల్ లెవెల్ లో భారీ హైప్ ఉంది. మరి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read : Google Doodle : గూగుల్ డూడుల్ చూశారా ? గుకేష్ దొమ్మరాజు, డింగ్ లిరెన్‌లకు అరుదైన గౌరవం