Site icon HashtagU Telugu

Mega Multistarrer: మెగా మల్టీస్టారర్.. ‘చరణ్-అర్జున్’ సినిమా తెరకెక్కెనా!

Mega Multistarar

Mega Multistarar

టాలీవుడ్ పెద్ద నిర్మాతల్లో ల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించాడు. గీతా ఆర్ట్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమాలు ష్యూర్‌ హిట్‌. నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అల్లు అరవింద్. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఇటీవల ఈటీవీలో ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెగా, అల్లు అభిమానులకు ఓ ఆసక్తికరమైన వార్తను అందించారు. పుష్ప సినిమా తనకు, తన కుమారుడు అల్లు అర్జున్‌కు మైలురాయి అని అన్నారు.

పుష్ప సినిమాతో బన్నీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతృప్తిగా ఉందన్నారు. గీతా ఆర్ట్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో చిత్రాలను నిర్మించానని చెప్పారు. మా బ్యానర్‌లో ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్టే. ఇక నిర్మాతగా ‘మగధీర’ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించి, మా బడ్జెట్‌కు మూడింతలు లాభాలు తెచ్చిపెట్టిన తృప్తి నాకుంది. మొదట్లో ఆయన సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే 80 శాతం ఎక్కువ బడ్జెట్ పెట్టారు. “నేను చాలా భయపడ్డాను, కానీ ఎడిటింగ్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసిన తర్వాత, నేను సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాను.”

ఆ తర్వాత రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లతో మల్టీస్టారర్‌ సినిమా చేయాలనేది తన కోరిక అని చెప్పాడు. పదేళ్ల క్రితమే చరణ్-అర్జున్ అనే టైటిల్ అనుకున్నాను. ఈ సినిమా కోసం కథలు వింటున్నారా అని అడిగినప్పుడు, ఇంకా లేదు అని బదులిచ్చారు. తన కలను నెరవేర్చుకుంటానని, వారితో సినిమా చేస్తానని చెప్పారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2, రామ్ చరణ్ శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.