Unstoppable Promo: చిరంజీవి, బాలకృష్ణతో ‘అల్లు’ పాన్ ఇండియా మూవీ.. బాలయ్య రియాక్షన్ ఇదే

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 కార్యక్రమం అన్ని వర్గాలను అలరిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Unstopable

Unstopable

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2’ కార్యక్రమం అన్ని వర్గాలను అలరిస్తోంది. ఇటు టాలీవుడ్ ప్రముఖులు, అటు రాజకీయ నాయకులు హాజరవుతూ షోను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో సహ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ సురేశ్ హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా తదుపరి ఎపిసోడ్‌తో టాలీవుడ్ దర్శక నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు సందడి చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ ప్రోమో బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో చిరంజీవి, బాలకృష్ణతో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నానని అల్లు అరవింద్ చెప్పగా.. అది పాన్ వరల్డ్ మూవీ అవుతుందని బాలకృష్ణ బదులిచ్చారు.

అటు సురేష్ బాబు, ఇటు అరవింద్ తెలుగు సినిమాలపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ మంచి థాళి భోజనం లాంటిదని అభిప్రాయపడ్డారు.  ఇక రాఘవేంద్రరావు తనదైన స్టయిల్ లో నవ్వులు పూయించారు. పూలు, పండ్లు అన్ని ఆడవాళ్లకేనా అని బాలయ్య అడిగిన ప్రశ్న ఆసక్తిని రేపింది. ఇక ఎన్టీఆర్ 100 ఏళ్ల వేడుకలను కూడా ప్రోమోలో చూపించారు. ఈ ఎపిసోడ్ 2 డిసెంబర్ 2022న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ అవుతుంది.

ఇక అన్ స్టాప్ ఫుల్ విత్ ఎన్బికె ఎపిసోడ్స్ అన్ని కూడా ఆసక్తికరంగా సాగుతున్న నేపథ్యంలో ప్రతి ఎపిసోడ్ ని చాలా స్పెషల్ కేర్ తీసుకుని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాబోతున్న ఎపిసోడ్స్ కూడా మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక చిరంజీవి కూడా ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఒక ఎపిసోడ్లో కనిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. చూడాలి మరి అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది.

  Last Updated: 01 Dec 2022, 02:24 PM IST