Site icon HashtagU Telugu

Ugram Trailer : వామ్మో అల్లరోడు ఇంత విధ్వంసమా?? ఉగ్రం ట్రైలర్ రిలీజ్..

Allari Naresh Ugram Trailer Released

Allari Naresh Ugram Trailer Released

కామెడీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) గత కొన్నాళ్లుగా సీరియస్ మోడ్ లోకి మారి తనలోని మరో కొత్త నటుడిని చూపిస్తూ సీరియస్ రోల్స్ తో సినిమాలు చేస్తున్నాడు. నాంది(Nandi) సినిమాతో అల్లరి నరేష్ పూర్తిగా తన పంథా మార్చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో కూడా మెప్పించి హిట్ కొట్టాడు. దీంతో మరోసారి అదే సీరియస్ పంథాలో వెళ్తూ ఉగ్రం(Ugram) సినిమాతో రాబోతున్నాడు.

అల్లరి నరేష్, మిర్నా జంటగా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో ఉగ్రం సినిమా రాబోతుంది. నాంది డైరెక్టర్ తో మరో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజయిన టీజర్, సాంగ్స్ తో ఈ సినిమా కూడా చాలా సీరియస్ మోడ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. తాజాగా ఉగ్రం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే మిస్ అయిన వాళ్ళని వెతికిపట్టుకోవడం, ఆ ప్రాసెస్ లో విలన్ తో నరేశ్ ఎలా తలపడ్డాడు అని ఉండొచ్చు అనిపిస్తుంది. ట్రైలర్ లోనే ఫ్యామిలీ పర్సన్ గా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అల్లరి నరేష్ అదరగొట్టేశాడు. ఎప్పుడూ చేయని విధంగా యాక్షన్ సీన్స్ చాలా పవర్ ఫుల్ గా చేశాడు. ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ ఉగ్ర రూపం చూపించాడని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది.

 

Also Read :  Virupaksha: అదేంటి విరూపాక్ష సినిమా విడుదల అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీ లోకా?