Allari Naresh : ఆ భయంతో ‘కార్తికేయ’ సినిమా వదులుకున్న అల్లరి నరేష్.. ఎందుకో తెలుసా..?

హీరో అల్లరి నరేష్(Allari Naresh) రవిబాబు(Ravibabu) తెరకెక్కించిన 'అల్లరి' సినిమాతో సూపర్ హిట్టుని అందుకొని ఆ టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Allari Naresh says no to Nikhil Siddhartha Karthikeya Movie

Allari Naresh says no to Nikhil Siddhartha Karthikeya Movie

ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ(EVV Satyanarayana) వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో అల్లరి నరేష్(Allari Naresh). రవిబాబు(Ravibabu) తెరకెక్కించిన ‘అల్లరి’ సినిమాతో సూపర్ హిట్టుని అందుకొని ఆ టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తరువాత కామెడీ సినిమాలతో వరుస విజయాలు అందుకొని నిర్మాతలతో మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. అయితే 2013 – 18 మధ్య సరైన హిట్టు లేక కొంచెం ఇబ్బంది పడ్డాడు. 2019లో మహేష్ బాబు మహర్షి సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి.. తన కెరీర్ ని కొత్త కోణంలో రీ స్టార్ట్ చేశాడు.

ఆ తరువాత ‘నాంది'(Nandi) అనే సినిమాలో కంప్లీట్ కొత్తగా కనిపించి అల్లరి అనే ట్యాగ్ ని పక్కన పెట్టి నాంది నరేష్ అనిపించుకున్నాడు. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో తన వద్దకి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం.. వంటి సీరియస్ కథలే వస్తున్నాయి. అయితే అంతా బాగుంటే నరేష్ కెరీర్ 2014 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ’తోనే రీ స్టార్ అయ్యేది. ఈ విషయాన్ని నరేష్ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలిపాడు. కార్తికేయ సినిమాలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఛాన్స్ మొదట నరేష్ కి వచ్చింది.

ఆ మూవీ దర్శకుడు చందు ముండేటి ఈ సినిమా కథని ముందుగా నరేష్ కి వినిపించాడు. స్టోరీ లైన్ కూడా నరేష్ కి బాగా నచ్చేసింది. కానీ ఒక చిన్న భయంతో ఈ మూవీకి నో చెప్పేశాడు. ఈ సినిమాలో పాములు ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నరేష్ కి పాములు అంటే చాలా భయం అంట. సినిమాల్లో చూసినా చాలా భయపడతాడట. ఆ భయంతోనే నరేష్ ఈ సినిమాకి నో చెప్పినట్లు తెలిపాడు. ఒకవేళ ఆ సినిమా నరేష్ చేసి ఉంటే ఇప్పుడు తన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది.

 

Also Read : Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!

  Last Updated: 08 Jul 2023, 08:36 PM IST