Allari Naresh : ఆ సినిమాలో నరేష్‌ని నిజంగానే కొట్టారు.. కొన్ని సెకన్ల పాటు మైండ్ బ్లాక్..

శంభో శివ శంభో సినిమాలో ఓ సీన్ లో అల్లరి నరేష్ ని నిజంగానే కొట్టారు.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 10:30 PM IST

‘అల్లరి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్న నటుడు ‘నరేష్'(Allari Naresh). హీరోగా కామెడీ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే.. అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు కూడా చేశారు. అలా నరేష్ చేసిన ఓ సినిమా ‘శంభో శివ శంభో'(Shambo Siva Shambo). రవితేజ(Raviteja) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్, శివబాలాజీ స్నేహితులుగా నటించారు. 2010లో ఈ సినిమా తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కింది.

ఈ సినిమాలో నరేష్ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. ఇక ఈ మూవీలోని ఓ సీన్ లో నరేష్ నిజంగానే దెబ్బతిని కొన్ని సెకన్ల పాటు మైండ్ బ్లాక్ కి గురయ్యారు. ఈ మూవీలో హీరో అండ్ గ్యాంగ్ తన స్నేహితుడు ప్రేమ కోసం హెల్ప్ చేస్తారు. ఈక్రమంలోనే ఆ ఫ్రెండ్ లవర్ ని లేపుకురావడానికి హీరో గ్యాంగ్.. ఆ అమ్మాయి ఊరుకి వెళ్తారు. అక్కడ నుంచి ఆ అమ్మాయిని తీసుకోని వస్తుంటే.. శివ బాలాజీకి ఒక కాలు పోతుంది. అల్లరి నరేష్ చెవులు పోతాయి. ఆ సీన్స్ అందరికి గుర్తుకు ఉండే ఉంటాయి.

ఈ సీన్స్ చిత్రీకరణ సమయంలోనే నరేష్ ని నిజంగానే కొట్టారు. ఈ సన్నివేశంలో నరేష్ రన్నింగ్ కారు పై డోర్ బయట నిలబడి ఉంటాడు. ఆ సమయంలో వెనక నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి కర్రతో కొడతారు. ఆ కర్ర దెబ్బతో సినిమాలో నరేష్ కి చెవులు పోతాయి. ఇక ఈ సీన్ నేచురల్ గా రావాలని నరేష్.. తనని నిజంగానే కొట్టమని చెప్పారు. దీంతో ఒక డమ్మీ కర్రకి ఒక పివిసి పైప్ తొడిగి.. నరేష్ ని కొట్టారు. డమ్మీ కర్ర, పివిసి రెండు కలిసి ఉండడంతో దెబ్బ కొంచెం గట్టిగానే తగిలిద్ది. కాబట్టి సీన్ కొంచెం నేచురల్ గా వస్తుందని నరేష్ భావించారు.

అయితే కొట్టే సమయంలో కర్ర చాలా ఫోర్స్ గా వచ్చి తగిలి ఇరిగిపోయింది. అలా ఇరగడంతో మొహానికి గట్టి తాకిడి జరిగింది. దీంతో ఆ సినిమాలో నరేష్ కి ఎలా మైండ్ బ్లాక్ అవుతుందో.. అలా ఆ దెబ్బ తగిలినప్పుడు కొన్ని సెకన్ల పాటు ఏమి వినిపించలేదు. అయినా సీన్ ని అలాగే కంటిన్యూ షూట్ చేశారు. సీన్ బాగా రావాలని నరేష్ అలా నటించారు. కట్ చేస్తే ఆ సన్నివేశం స్క్రీన్ పై చాలా నేచురల్ గా వచ్చింది. ఈ విషయాన్ని నరేష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 

Also Read : Sivaji : శివాజీ సినిమాలో అపరిచితుడు.. డిలీట్ సీన్ మీరు చూశారా..?