Site icon HashtagU Telugu

Allari Naresh Bacchala Malli First Look Poster : నరేష్ ఊర మాస్.. బచ్చల మల్లి ఫస్ట్ లుక్ అదిరిందిగా..!

Allari Naresh Bacchala malli Business Details

Allari Naresh Bacchala malli Business Details

Allari Naresh Bacchala Malli First Look Poster అల్లరి నరేష్ రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాంది నుంచి వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరోడు మళ్లీ తన పాత ట్రాక్ లో ఆ ఒక్కటి అడక్కు సినిమా చేశాడు. ఇక లేటెస్ట్ గా మరోసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు అల్లరి నరేష్. సోలో బ్రతుకే సో బెటర్ ఫేం సుబ్బు డైరెక్షన్ లో నరేష్ హీరోగా బచ్చల మల్లి సినిమా వస్తుంది. ఈ సినిమా టైటిలే డిఫరెంట్ గా అనిపించగా లేటెస్ట్ గా సినిమా నుంచి నరేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

రిక్షాలో సిగరెట్ తాగుతూ అల్లరి నరేష్ మాస్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ తోనే సినిమా పీరియాడికల్ కథతో వస్తుందని అర్ధమవుతుంది. అల్లరి నరేష్ మరోసారి డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్న ఈ బచ్చల మల్లి పోస్టర్ తోనే సినిమాపై మంచి బజ్ పెంచారు మేకర్స్. హాస్య మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో అమేర అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.

అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న ఈ సినిమా విషయంలో నరేష్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే బచ్చల మల్లి రేంజ్ పెంచిన చిత్ర యూనిట్ సినిమాను కూడా అంతకుమించి అనిపించేలా చేస్తున్నారని తెలుస్తుంది. అల్లరి నరేష్ క్యారెక్టరైజేషన్ కూడా ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు.