Allari Naresh Bacchala malli Business ఆ ఒక్కటి అడక్కు అంటూ రీసెంట్ గా ప్రేక్షకులను పలకరించిన అల్లరి నరేష్ తన నెక్స్ట్ సినిమాతో మరోసారి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటరే ఫేం సుబ్బు డైరెక్షన్ లో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా బచ్చల మల్లి. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే బజ్ పెంచిన మేకర్స్ అందుకు తగినట్టుగానే బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు. బచ్చల మల్లి సెట్స్ మీద ఉండగానే బిజినెస్ బ్రహ్మాండంగా జరిగిందని తెలుస్తుంది.
సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అదే డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి 9 కోట్ల దాకా పలికాయని తెలుస్తుంది. ఇక థియేట్రికల్ రైట్స్ ని 5 కోట్లకు అమ్మేశారట. సో టోటల్ గా సినిమా రిలీజ్ కు ముందే 14 కోట్లను తెచ్చుకుంది. థియేట్రికల్ రైట్స్ 4 కోట్లు అంటే సినిమా హిట్ టాక్ వస్తే అదేమంత విషయం కాదు.
అల్లరి నరేష్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. బచ్చల మల్లి సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది అని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ లో రాజేష్ నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ తన కామెడీ పంథా వదిలి మరోసారి సీరియస్ గా చేస్తున్న ఈ బచ్చల మల్లి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read : NTR Devara Prepone : దేవర ముందుకు వస్తుందా.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే..!