Jaya Prada : అలహాబాద్‌ హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 01:32 PM IST

 

Jaya Prada : సీనియర్ నటి జయప్రద పై ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని రాంపూర్‌ కోర్టు(Rampur Court)నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌(Non-bailable warrant)‌ని జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వారెంటుని నిలిపివేయాలని కోరుతూ జయప్రద.. అలహాబాద్‌ హైకోర్టు(Allahabad High Court)లో పిటిషన్ ని దాఖలు చేశారు. దాని పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ ని కొట్టివేసింది. అంతేకాదు మార్చి 6 లోపు ఆమె అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో జయప్రదకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

అసలు ఏమి జరిగిందంటే.. 2019 రాంపూర్‌ లోక్‌సభ ఎలక్షన్స్‌లో జయప్రద బీజేపీ(bjp) నుంచి పోటీకి దిగారు. అప్పుడు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆమె ఓ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో జయప్రద పై స్వార్‌ పోలీసుస్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇక కోర్టులో నడుస్తున్న ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ జయప్రదకు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా.. ఆమె హాజరు కాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో రాంపూర్‌ కోర్టు జయప్రదని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటిస్తూ.. ఆమెపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఇక ఈ వారెంటును సవాలు చేస్తూ జయప్రద తరుపు న్యాయవాది.. వారెంటుని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఆ పిటిషన్ ని విచారించిన ధర్మాసనం.. దానిని కొట్టిపారేస్తూ, మార్చి 6 లోపు జయప్రదని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ తీర్పు పై జయప్రద తరుపు న్యాయవాది స్పందిస్తూ.. త్వరలోనే మరికొన్ని వాస్తవాలతో మరో పిటిషన్‌ ని దాఖలు చేస్తామంటూ న్యాయస్థానాన్ని కోరడంతో న్యాయమూర్తి కూడా అంగీకరించారు. మరి ఈసారైనా జయప్రదకు ఊరట లభిస్తుందా లేదా చూడాలి. కాగా జయప్రద ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ సరసన నటిస్తూ ‘లవ్@65’ మూవీ చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

read also : Salman Khan : వామ్మో..రూ.23 కోట్లు పెట్టి వజ్రాల వాచ్ కొనుగోలు చేసిన హీరో