Unstoppable 2.0: అన్‌స్టాపబుల్ సీజ‌న్‌ 2 ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం సంపాదించుకున్నారు.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 11:54 PM IST

నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం సంపాదించుకున్నారు. అన‌వ‌స‌ర విష‌యాల‌కు వెళ్ల‌ని ఆయ‌న.. అభిమానుల విష‌యంలో కొన్నిసార్లు కోపంతో చేతివాటం చూపించారు. అయినాస‌రే.. అభిమానుల‌కు బాల‌కృష్ణ అంటే ఎనలేని అభిమానం.

అయితే బాల‌య్య‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది ఓటీటీ ఆహాలోని అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే షో. అప్ప‌టివ‌ర‌కు ఆయ‌నంటే ఇష్టం లేని వాళ్లు కూడా ఆ షో చూసిన త‌ర్వాత బాల‌య్య అంటే ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెట్టారంటే అర్థం చేసుకోవ‌చ్చు ఆ షో బాల‌కృష్ణ‌కు ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో.

అయితే.. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అంటూ ఓటీటీ అయినా ఆహాలో వ‌చ్చిన ఈ షో మొద‌టి సీజ‌న్‌ను బాల‌కృష్ణ త‌న హోస్టింగ్ తో నెంబ‌ర్ వ‌న్ స్ఠానంలో నిల‌బెట్టారు. ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 2 త్వ‌ర‌లోనే మొద‌లుకాబోతుంది. సీజన్ 2 కోసం కూడా మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను రంగంలోకి దింపింది ఆహా బృందం. అయితే సీజ‌న్ 2కి సంబంధించిన ట్రైల‌ర్‌ను ఆహా యూనిట్‌ అక్టోబర్ 4వ తేదీన‌ విజయవాడలో అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నారు. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ.. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌బీకే 107 చిత్రంలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.