Site icon HashtagU Telugu

Ban Adipurush: థియేటర్లో ఆదిపురుష్ నిషేధించి OTT లో రీలీజ్ చేసుకోవాలని మోడీకి లేఖ

Ban Adipurush

New Web Story Copy 2023 06 20t143941.443

Ban Adipurush: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమాపై రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తుంది. సినిమా షూటింగ్ మొదలుకుని విడుదల తరువాత కూడా ఆదిపురుష్ ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలోని వివిధ చోట్ల ఈ చిత్రంపై వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా, ఖాట్మండులో ఆదిపురుష్ ను నిషేధించారు. మరోవైపు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మొబైల్ స్క్రీనింగ్‌ను నిలిపివేసినట్లు సమాచారం.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో సినీ సంస్థలు కూడా ఉండటం విశేషం. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ‘ఆదిపురుష్’ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ, ఓటిటీలో విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ సినిమాని థియేటర్లలో ప్రదర్శించడాన్ని వెంటనే నిషేధించాలని, అలాగే భవిష్యత్తులో ఏదైనా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయాలని ఆల్ ఇండియా సినీ వర్క్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

ఆదిపురుష్ విడుదల తర్వాత ప్రజల మనోభావాలను దెబ్బతీయడంపై గతంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు. అయితే ఇన్ని వివాదాలు, విమర్శల మధ్య ఆదిపురుష్ కలెక్షన్ల పరంగా అదరగొడుతుంది.

Read More: Kapu fight : ముద్ర‌గ‌డ‌కు `తిక్క‌`రేగింది.! జ‌న‌సేనానిపై లేఖాస్త్రం!!