Site icon HashtagU Telugu

Alia Bhatt’s Ayodhya Saree : వైరల్ గా మారిన ఆలియా అయోధ్య చీర..

Alia Bhatt Special Ayodya S

Alia Bhatt Special Ayodya S

అయోధ్య (Ayodhya) లో 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడింది సంగతి తెలిసిందే. అయోధ్య రామ మందిరం (Ram Mandir) ఏర్పాటు చేసి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకను కనులార చూసేందుకు పెద్ద ఎత్తున అన్ని రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

బాలీవుడ్ నుండి సైతం పెద్ద ఎత్తున సినీ తారలు హాజరై సందడి చేసారు. ఇక ఆలియా భట్ తన భర్త రణ్​బీర్​తో కలిసి వచ్చింది. ఈ కార్యక్రమంలో అలియా (Alia Bhatt) ధరించిన చీర (Saree)..ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా ఓ ప్రత్యేకమైన చీరను డిజైన్ చేయించుకుంది. రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో (Beautiful Epic of Ramayana) ఈ చీరను డిజైనర్లు రూపొందించారు. బ్లూ కలర్ శిల్క్ శారీలపై రామణంలోని ఘట్టాలను పొందుపరిచారు. అయితే ఈ డిజైన్లను ప్రింట్ చేయలేదని చేతులతో దీనిని చేశామని డిజైనర్ తెలిపారు.

రామాయణంలోని రామసేతు, హనుమాన్, శివ ధనుర్భంగం, రాముడి వనవాసం, గంగానదిపై తీగల వంతెన, బంగారు జింక, సీతను అపహరించడం.. తదితర ఘట్టాలను చిత్రీకరించారు. ఈ చీర ధర రూ.45 వేలు కాగా ఆర్టిస్టులు 100 గంటలపాటు కష్టపడి తయారు చేశారట. ప్రస్తుతం ఈ చీరలో ఆలియా లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also : Lavanya Tripathi : మెగా కండీషన్స్ పై లావణ్య కామెంట్స్.. ఇలా అస్సలు ఊహించలేదు..!