Site icon HashtagU Telugu

Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్

Viral Video

Viral Video

Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో  కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియోలో ఒక ఇంటి పనిమనిషి పెంపుడు జంతువుపై హింసాత్మకంగా దాడి చేయడం చూడవచ్చు.

“ఈ పనిమనిషి చేతిలో క్రూరంగా కొట్టబడిన కుక్క వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ ఘటనపై జంతు ప్రేమిలకు ఫిర్యాదు చేయండి. ఇలాంటి వీడియోను తానెప్పుడూ చూడలేదని, షాక్ కు గురయ్యానని నటి పేర్కొంది. అయితే ఆలియా శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సోఫీ పోస్ట్ను తిరిగి షేర్ చేసింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నెటిజన్స్ కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అలియా పోస్ట్ వైరల్ గా మారింది.