Alia Bhatt: బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న అలియా భట్.. ఏడాదికి అన్ని రూ.కోట్లు సంపాదిస్తుందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 04:10 PM IST

Alia Bhatt: తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లో అందం అభినయం కలగలసిన హీరోయిన్లలో అలియా భట్‌ కూడా ఒకరు. అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అలియా భట్‌ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతోంది. సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా భారీగా డబ్బులు సంపాదిస్తోంది. బిజినెస్ రంగంలో కంపెనీ స్థాపించిన చేయడానికి దాదాపుగా రూ.150 కోట్లకు స్థాయికి చేరుకుంది అలియా భట్‌.

కాగా నేడు అనగా మార్చి 15న అలియా భట్‌ పుట్టినరోజు. ఈరోజు ఆమె తన 30వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. కాగా అలియా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎడ్-ఎ-మమ్మా అనే కంపెనీని ప్రారంభించి ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో 800పైగా ప్రొడక్ట్స్‌తో 2 నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లల దుస్తులను విక్రయిస్తోంది. అలా కేవలం 12 నెలల్లోనే అనగా ఏడాది లోనే ఈ కంపెనీ 10 రెట్లు వృద్ధితో రూ.150 కోట్ల వాల్యుయేషన్‌ను సాధించడం అన్నది గొప్ప విషయమే అని చెప్పవచ్చు. ఇదే విషయంపై అలియా భట్ స్పందిస్తూ.. బిజినెస్ గురించి నేర్చుకుంటున్నాను. కేవలం ఏడాది వ్యవధిలో సంస్థ సాధించిన ఘనత గర్వకారణం అని తెలిపింది అలియా.

మొదటి చిన్న కలగా మొదలై ప్రస్తుతం 150 కోట్ల వ్యాపారంగా మారింది. నేను కంపెనీపై కాకుండా వ్యక్తులు వారి ఆలోచనలపైనే పెట్టుబడి పెడతాను అని చెప్పుకొచ్చింది ఆలియా. ఇకపోతే ప్రస్తుతం అలియా భట్‌ నికర విలువ రూ.299 కోట్లు. కాగా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఒక్కో పాత్రకు 20 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా తన చిన్నతనంలో తన తండ్రి మహేష్ భట్ పాదాలకు క్రీమ్ రాసేందుకు రూ.500 సంపాదించేదట. అదే తన తొలి సంపాదన అని తెలిపింది అలియా.
కాగా అలియా భట్‌కు రెండు లగ్జరీ, ఇళ్లు బీఎండబ్ల్యూ 7 సిరీస్‌, ఆడి ఏ6, ఆడి క్యూ7తో పాటు మూడు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ వంటి అనేక కార్లు ఉన్నాయట.