బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం ఫాం కోల్పోకుండా సత్తా చాటుతుంది. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేస్తూ ఫ్యాన్స్ ని అలరిసుతంది. బాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్న అలియా భట్ (Alia Bhatt) ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఫుల్ గా వెళ్తుందని చెప్పొచ్చు.
RRR సినిమాతో తెలుగు ఆడియన్స్ కు ఆమె దగ్గరైంది. ఐతే అలియా భట్ స్టార్స్ కు ఈక్వల్ రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఒక సినిమాకు అమ్మడు 18 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అంతేకాదు అలియా భట్ మొత్తం ఆస్తి విలువ 500 కోట్ల దాకా ఉంటుందని టాక్. తన కంపెనీ 150 కోట్లతో రన్ చేస్తుందని తెలుస్తుంది.
బాలీవుడ్ స్టార్ (Star) హీరోయిన్స్ ఈ రేంజ్ లో ఆస్తులు మూకట్టుకుంది అలియా భట్ మాత్రమే. సినిమాకు తాను ఎంత కష్టపడుతుందో అందుకు తగిన రెమ్యునరేషన్ అందుకుంటుంది. అందుకే సినిమాకు 18 కోట్లకు తగ్గనని అంటుంది. అలియా భట్ సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నా సరైన అవకాశాలు రాలేదు. అలియా మళ్లీ తెలుగు సినిమా చూస్తే చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. బాలీవుడ్ లో మిగతా హీరోయిన్స్ కి అలియా భట్ గట్టి పోటీ ఇస్తుంది. సౌత్ లో కూడా అలియా క్రేజ్ చూసి మిగతా హీరోయిన్స్ కుళ్లుకునే పరిస్థితి వచ్చింది.