Alia Bhatt : ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై స్పందించిన అలియా భట్..

ప్రస్తుతం అలియా ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ఆస్వాదిస్తూనే మరో పక్క సినిమాలు కూడా చేస్తుంది. అయితే గతంలో, ఇప్పుడు కూడా అలియా భట్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Alia Bhatt Reacts on Her Plastic Surgery Rumors in Kofee with Karan Show

Alia Bhatt Reacts on Her Plastic Surgery Rumors in Kofee with Karan Show

బాలీవుడ్(Bollywood) భామ అలియా భట్(Alia Bhatt) ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. మహేష్ భట్ కూతురిగా సినీ పరిశ్రమలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. తెలుగులో RRR సినిమాలో నటించి మెప్పించింది. ఇటీవలే ఓ హాలీవుడ్ సినిమాలో కూడా యాక్షన్ తో మెప్పించింది అలియా.

ఇప్పటి హీరోయిన్స్ అంతా లేట్ మ్యారేజీలు చేసుకుంటుంటే అలియా మాత్రం రణబీర్ కపూర్(Ranbir Kapoor) ని పెళ్లి చేసేసుకొని ఓ పాపకి తల్లి అయింది కూడా. ప్రస్తుతం అలియా ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ఆస్వాదిస్తూనే మరో పక్క సినిమాలు కూడా చేస్తుంది. అయితే గతంలో, ఇప్పుడు కూడా అలియా భట్ పై కొన్ని రూమర్స్ వచ్చాయి. అలియా అందంగా మారడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది, రణబీర్ అలియాను సరిగ్గా చూసుకోవట్లేదని వార్తలు వచ్చాయి.

తాజాగా కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన అలియా భట్ వీటిపై స్పందించింది. అలియా భట్ మాట్లాడుతూ..ఇప్పుడంతా సోషల్ మీడియానే. అందులో రోజుకొక రూమర్ వస్తుంది. నేను సన్నగా మారడానికి, తెల్లగా అవ్వడానికి సర్జరీలు చేయించుకున్నాను అని రూమర్స్ రాశారు. నా మ్యారేజ్ లైఫ్ మీద కూడా రూమర్స్ రాశారు. రణబీర్ నన్ను వేధిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసారు. ఇలాంటి విషయాల మీద జనాలు ఫోకస్ చేయడం బాధగా అనిపిస్తుంది. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. అందులో నిజాలు ఉండవు. అందుకే నేను వీటిని అసలు పట్టించుకోను అని చెప్పింది. మరి ఇప్పటికైనా అలియాపై రూమర్స్ ఆపుతారేమో చూడాలి.

 

Also Read : Sound Party Trailer : బిగ్‌బాస్ విన్నర్ VJ సన్నీ సౌండ్ పార్టీ ట్రైలర్ చూశారా?

  Last Updated: 18 Nov 2023, 06:27 AM IST